Gold Rate Today: పండగలు వస్తున్నాయి…వెళుతున్నాయి కానీ బంగారం రేటు మాత్రం స్థిరంగా ఉంది. కొనాలంటే భయం వేసే రేంజ్ లో పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. హైదరాబాద్ (Hyderabad) మార్కెట్లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 57,200 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 62,400 గా ఉంది. కిలో వెండి (Silver) ధర హైదరాబాద్ మార్కెట్లో ₹ 78,500 గా ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా బంగారం ధరలు ఇలాగే ఉన్నాయి. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 57,200 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర ₹ 62,400 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 78,500 గా ఉంది.
పూర్తిగా చదవండి..Gold Rate Today:రోజురోజుకూ పైపైకే బంగారం ధరలు
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, ఫెడ్ మీటింగ్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పెరగడమే తప్ప ఎక్కడా తగ్గు ముఖం పట్టడం లేదు. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,007 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ₹ 210, స్వచ్ఛమైన పసిడి ధర ₹ 230 చొప్పున దిగి వచ్చాయి. వెండి రేటు ₹ 1,000 పెరిగింది.
Translate this News: