మామూలుగా వాతావరణం లేని చోట ధ్వని ప్రయాణించదని థియరీ. అలా అయితే స్పేస్ శూన్యం కాబట్టి అక్కడ ఎటువంటి ధ్వనీ ఉండదు….అంతే అనుకుంటున్నారా. కానీ లేదండీ అక్కడ కూడా ధ్వని ఉంటుంది అంట. అయితే భూమ్మీద ఉండేంత ఉండదు. స్పేస్ లో వేలకొద్దీ నక్షత్రాలు, గెలాక్సీ క్లస్టర్లు అన్నీ ఫుల్ గ్యాస్ తో నిండి ఉంటాయిట. వాటిలో ధ్వని ప్రయాణిస్తుంది అని చెబుతున్నారు. 2003లో బ్లాక్ హోల్ నుంచి వచ్చిన శబ్దాలను గుర్తించామని గుర్తుచేస్తున్నారు. అయితే అక్కడ వినిపించిన ధ్వని మనకు సాధారణంగా వినపబే స్థాయిలో ఉండదు కాబట్టి దాన్ని ఫ్రీక్వెన్సీ పెంచి మనకు వినిపించారు.
పూర్తిగా చదవండి..Space wonders:అంతరిక్షంలో కూడా రంగు, రుచి, వాసన..ఉంటాయా?
భూమ్మీద ఏ చోటకు వెళ్ళినా అక్కడి వాతావరణం బట్టి రంగు, రుచి, వాసన, శబ్దాలు మనకు తెలుస్తుంటాయి. వెళ్ళిన ప్రతీచోటా మనం ఏదోక అనుభూతిని పొందుతూనే ఉంటాం. అలాగే అంతరిక్షంలో కూడా అలాంటి అనుభూతులు ఉంటాయా అంటే....అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. అక్కడ కూడా పైవన్నీ మనం తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
Translate this News: