మొన్నటివరకు టమోటా వంతు..ఇప్పుడు ఉల్లి వంతు. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. టమోటా ధరలతో షాక్ అయిన సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు ఉల్లిపేరు చెబుతేనే భయపడుతున్నారు. డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో ఉల్లి ధరలు కొద్ది వారాల్లోనే రెండింతలు పెరిగాయి. ఈసారి రుతుపవనాలు ఆలస్యం రావడంతో ఆ ఎఫెక్ట్ ఉల్లిపై పడింది. ఫలితంగా డిమాండ్ కు తగ్గట్లుగా మార్కెట్లో ఉల్లిపాయలు లేకపోవడంతో ధరలు ఆమాంతం పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు 20 నుంచి 30 రూపాయలు పలికిన ఉల్లి ధరలు ఇప్పుడు కిలో 40 నుంచి 50 రూపాయలకు చేరుకుంది. ఈ రేటు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంది.
పూర్తిగా చదవండి..Onion Prices: ఉల్లి ధరలు సెంచరీ కొడతాయా? ఒక్కసారిగా డబుల్ అయిన ధరలు..!!
ఉల్లి కొండెక్కి కూర్చుంది. ధరలు కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలో కిలో ఉల్లిగడ్డపై ఏకంగా రూ. 20 పెరిగింది. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ. 45 నుంచి రూ. 50 వరకు విక్రయిస్తున్నారు. ఈ సంవత్సరం వేసవి నుంచి ఇప్పటి వరకు ఉల్లిపాయ ధరలను చూస్తే..జూన్ లో కిలో ఉల్లి ధర రూ. 15 ఉంటే..ఆగస్టులో రూ. 20కి పెరిగింది. సెప్టెంబర్ లో రూ. 30 పెరిగితే..అక్టోబర్ లో కిలో ధర రూ. 40 నుంచి రూ. 50కి విక్రయిస్తున్నారు.
Translate this News: