‘నిజం గెలవాలి’ పేరుతో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) రేపటి నుంచి చేయనున్న యాత్రపై ఏపీ మంత్రి రోజా (AP Minister Roja) సెటైర్లు వేశారు. నిజం గెలవాలని నారా భువనేశ్వరితో పాటు తాము కూడా కోరుకుంటున్నామన్నారు. భువనేశ్వరి కోరుకున్నట్లు నిజం గెలిస్తే చంద్రబాబుకు (Chandrababu) శాశ్వత జైలు జీవితం ఖాయమని ఎద్దేవా చేశారు. ఈ రోజు తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు కాదు భువనేశ్వరి లోకేష్ సైతం జైలుకి వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు. భువనేశ్వరికి నిజంగా నిజం గెలవాలని ఉంటే సీబీఐ ఎంక్వైరీ కోరాలని డిమాండ్ చేశారు. నిన్న జనసేన టీడీపీ సమావేశం చూస్తే పాడుతా తీయగా సెలక్షన్స్ కి కూర్చున్నట్లు అనిపించిందని తనదైన శైలిలో స్పందించారు.
ఇది కూడా చదవండి: రేపటి నుంచే నారా భువనేశ్వరి బస్సుయాత్ర.. నినాదం ఇదే..!
Minister Roja: భువనేశ్వరి కోరుకున్నట్లు జరిగితే చంద్రబాబు జీవితాంతం జైల్లోనే.. మంత్రి రోజా సైటర్లు!
చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి రేపటి నుంచి చేయనున్న నిజం గెలివాలి యాత్రపై ఏపీ మంత్రి రోజా తనదైన శైలిలో స్పందించారు. భవనేశ్వరితో పాటు తాము కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నామన్నారు. భువనేశ్వరి కోరుకుంటున్నట్లు జరిగితే చంద్రబాబు జీవితాంతం జైళ్లోనే ఉంటాడని సెటైర్లు వేశారు. నిన్న జరిగిన జనసేన-టీడీపీ మీటింగ్ పాడుతా తీయగా ప్రోగ్రామ్ సెలక్షన్స్ ను తలపించిందని రోజా ఎద్దేవా చేశారు.
Translate this News: