దసరా పండుగను (Dasara Festival) పురస్కరించుకొని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (TS CM KCR) రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను ‘విజయ దశమి’ పేరుతో దేశ వ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం అన్నారు. దసరా నాడు కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట గుమికూడి సామూహికంగా సంబురాలు జరుపుకోవడం తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుందని సీఎం అన్నారు.
ఇది కూడా చదవండి: Dussera 2023: దసరా రోజు జమ్మి చెట్టుని ఎందుకు పూజిస్తారు…పాలపిట్టను ఎందుకు చూడాలి!
CM KCR: కేసీఆర్ దసరా శుభాకాంక్షలు.. ఈ పండుగ తెలంగాణకు స్పెషల్ అన్న సీఎం
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగకు తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. దసరా నాడు శమీ పూజ, అలాయ్ బలాయ్, పాలపిట్టను దర్శించుకోవడం తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమని సీఎం అన్నారు.
Translate this News: