Gaganyaan TV-D1 Mission: శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్‌యాన్ ప్రయోగానికి ముందు శనివారం ఉదయం జరపనున్న టెస్ట్ వెహికల్ డీ1 ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీహరికోటలోని (Sriharikota) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ చిన్న రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు. ఇది కేవలం 16.9 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణిస్తుంది. అయితే భవిష్యత్‌లో ఈ పరిశోధన ఇస్రో శాస్త్రవేత్తలకు (Isro Scientists) ఎంతో ఉపయోగపడుతుంది. గగన్‌యాన్ ప్రయోగంలో వ్యోమగాములను అంతరిక్షంలోకి చేర్చే ఘట్టంలో భాగంగా ఏదైనా అవాంతరం చోటు చేసుకుంటే క్షేమంగా వారు తప్పించుకోవడానికి ఈ క్రూ ఎస్కేప్ సిస్టంను ఉపయోగిస్తున్నారు. మనుషులు ప్రయాణించే క్రూ మాడ్యూల్ ఖాళీగా ఉంచి ఒక చిన్న రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపడుతున్నారు.
పూర్తిగా చదవండి..Gaganyaan TV-D1: మానవసహిత ప్రయోగానికి సర్వం సిద్ధం.. రేపు గగన్‌యాన్ టీవీ డి-1 పరీక్ష
శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన సంస్థ గగన్‌యాన్ ప్రయోగానికి ముందు శనివారం ఉదయం జరపనున్న టెస్ట్ వెహికల్ డీ1 ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శ్రీహరికోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ చిన్న రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు.
Translate this News: