Israel Bomb Blast in Gaza Hospital: గాజాలో దారుణం జరిగింది. పది రోజులగా ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం (Israel Hamas war)జరుగుతోంది. ఇందులో సామాన్యపౌరులు సైతం ప్రాణాలు విడుస్తున్నారు. వేలల్లోనే ఈ సంఖ్య ఉంది కూడా. ఇప్పుడు అంతకంటే ఘోరం జరిగింది. గాజాలో ఆసుపత్రి మీద బాంబు దాడి జరగడంతో 500 మంది అక్కడిక్కడే మరణించారు. గాజాలోని అల్ అహ్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరిగిన గొడవల్లో, దాడుల్లో ఇదే పెద్దది. ఇక ఉత్తర గాజాలో దాడులు చేస్తాం…అక్కడ ప్రాంతాన్ని ఖాళీ చేయండి అని చెప్పిన ఇజ్రాయెల్ దక్షిణ గాజాలో కూడా దాడులు చేస్తోంది. నిన్న జరిగిన దాడుల్లో దక్షిణ గాజాలో పదుల సంఖ్యలో పాలస్తీనావాసులు మరణించారు.
పూర్తిగా చదవండి..Israel attack on Gaza: గాజా ఆసుపత్రిలో పేలిన బాంబు, 500మంది మృతి
యుద్ధాలెప్పుడూ మానవాళికి చేటే చేస్తాయి. ఇది చాలా సార్లు నిరూపితమైంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య యుద్ధం అమాయక ప్రాణాలను బలి తీసుకుంది. గాజాలో ఓ ఆసుపత్రి మీద బాంబు పడి దాదాపు 500 మంది మృత్యువాత పడ్డారు.
Translate this News: