తెలంగాణలో బతుకమ్మ సంబరాలు (Bathukamma Festival) ఈ రోజు నుంచే ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు ఈ పూల జాతర.. ఊరూ వాడా కొనసాగనుంది. తొలి రోజు నిర్వహించే బతుకమ్మ సంబరాలను ఎంగిలి పూల బతుకమ్మ అని అంటారు. ఇంకా.. బతుకమ్మ వేడుకలు పెత్ర అమావాస్య రోజు ప్రారంభం అవుతాయి. ఈ రోజు పెద్దల ఆత్మకు శాంతి కలగాలని అనేక రకాల వంటలు చేసి వారికి తర్పనాలు ఇస్తారు. కొన్ని ప్రాంతాల్లో పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు బియ్యం ఇస్తారు. అలా ఇచ్చిన తర్వాత భోజనం చేసి.. తెలంగాణ పల్లె భాషలో చెప్పాలంటే ఎంగిలి పడి బతుకమ్మను పేరుస్తుంటారు.
పూర్తిగా చదవండి..Telangana Bathukamma: నేడే ఎంగిలి పూల బతుకమ్మ.. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
తెలంగాణలో నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు జరిగే ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలకు ఊరూ వాడా ముస్తాబయ్యాయి. తెలంగాణ పల్లె భాషలో చెప్పాలంటే తొలిరోజు ఎంగిలి పడి బతుకమ్మను పేరుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఎంగిలి పూల బతుకమ్మ అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతుంటారు.
Translate this News: