Neeraj Chopra Catches Indian Flag: ఆసియా గేమ్స్‌లో(Asia Games 2023) ఇండియన్ అథ్లెట్స్ అదరగొడుతున్నారు. తమ ప్రతిభతో పతకాలను కొల్లగొడుతున్నారు. 2018 ఆసియా గేమ్స్ రికార్డ్‌ను చరిపేస్తూ పతకాల వేట సాగిస్తున్నారు. 2018 ఆసియా గేమ్స్‌లో ఇండియన్ ప్లేయర్స్ 70 మెడల్స్ సాధించగా.. ఈ సారి సెంచరి వైపు దూసుకెళ్తున్నారు ప్లేయర్స్. ఇప్పటి వరకు ఇండియన్ ప్లేయర్ 85 మెడల్స్ సాధించారు. వీటిలో 21 గోల్డ్ మెడల్స్, 32 సిల్వర్, 33 బ్రోంజ్ పతకాలు ఉన్నాయి. పతకాల పరంపర కొనసాగుతుండటంతో ఆటగాళ్ల సంతోషానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ఇకపోతే.. పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, కిషోర్ జెనా మొదటి స్థానంలో నిలవడంతో భారత్ స్వర్ణం, రజతం సాధించారు. వరుసగా రెండవ పతకం. అలాగే పురుషుల 4×400 మీటర్ల రిలేలో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
పూర్తిగా చదవండి..Neeraj Chopra: సెల్యూట్ నీరజ్ చోప్రా.. ఇదీ కదా దేశ భక్తి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..
అసియా గేమ్స్ లో బారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. పతకాల వేట సాగిస్తున్నారు. ఇప్పటి వరకు 85 పతకాలు సాధించారు. స్వర్ణ పతకం గెలవడంతో నీరజ్ చోప్రా సంబరాలు చేసుకున్నారు. తోటి ప్లేయర్లతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఆ సందర్భంగా ఓ అభిమాని ఇండియన్ ఫ్లాగ్ పట్టుకోమని విసరగా.. అది కిందపడబోయింది. కానీ, ఫ్లాగ్ ను కిందపడనీయకుండా నీరజ్ క్యాచ్ పట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Translate this News: