Posani Krishna Murali: ప్రముఖ సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) మరో సారి సంచలన వాఖ్యలు చేశారు. ఏపీలో భర్తలని మించిన భార్యలు ఉన్నారంటూ నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari), బ్రహ్మణి (Nara Bramhani) టార్గెట్ గా పరోక్షంగా విమర్శలు చేశారు. తప్పు చేస్తే నిలదీయాల్సింది పోయి.. సమర్థిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. భర్త, కొడుకు నాశనం కావటానికి ప్రధాన కారణం భువనేశ్వరేనంటూ తీవ్ర వాఖ్యలు చేశారు పోసాని. అత్తాకోడళ్లు ఇద్దరూ మా ఆయన మంచివాళ్ళని అనుకుంటున్నారని సెటైర్లు వేశారు. చంద్రబాబును (Chandrababu) జైలుకు పంపింది జగన్ (CM jagan) ఎలా అవుతారని ప్రశ్నించారు పోసాని. అలా పంపించాలనుకుంటే నాలుగేళ్ల ముందే పంపించే వారు కదా అని అన్నారు. ఒక్కపుడు చంద్రబాబు, లోకేష్ (Nara Lokesh) ను తిట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆయనను ముఖ్యమంత్రిని చేస్తా అంటున్నాడంటూ ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పిచ్చోడు, అమాయకుడంటూ తీవ్ర వాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి. కాపు ఓట్ల కోసమే టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ తో మంచి సంబంధాలు మెయింటేన్ చేస్తున్నారంటూ పోసాని ధ్వజమెత్తారు.
ఇది కూడా చదవండి: Sajjala: టీడీపీ నేతల దీక్షలపై సజ్జల సెటైర్లు.. పూనకాలు వద్దంటూ పవన్ పై ఫైర్
Posani Krishna Murali: బ్రాహ్మణి, భువనేశ్వరి భర్తలను మించిన భార్యలు.. పవన్ ఓ పిచ్చోడు: పోసాని సంచలన వీడియో
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి నారా బ్రాహ్మణి, భువనేశ్వరి భర్తలను మించిన భార్యలంటూ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాన్ పిచ్చోడు, అమాయకుడంటూ తీవ్ర వాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి.
Translate this News: