CID Officials to Question Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబును(Chandrababu) సీఐడీ అధికారులు(CID Officers) తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం 9.30 గంటల నుంచి ఆయనను విచారించనున్నారు. చంద్రబాబును విచారించేందుకు విజయవాడ నుంచి రాజమండ్రికి బయలుదేరారు సీఐడీ అధికారులు. 12 మందితో కూడిన బృందం.. చంద్రబాబును విచారించనుంది. ఈ బృందంలోని అధికారుల పేర్లను సీఐడీ తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు సమర్పించారు. ఈ బృందంలో 9 మంది సీఐడీ అధికారులు, సిబ్బందితో పాటు ఒకక వీడియో గ్రాఫర్, ఇద్దరు మధ్యవర్తులు ఉన్నారు. వారి పేర్లతో కూడిన జాబితాను సీఐడీ తరపు న్యాయవాదులు నిన్న ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. ఆర్థిక నేరాల విభాగం-2 డీఎస్పీలు ఎం. ధనుంజయుడు, వి.విజయ్ భాస్కర్, ఎ. లక్ష్మీనారాయణ, ఇన్స్పెక్టర్లు ఎన్.ఎల్.వి.మోహన్ కుమార్, వై. రవికుమార్, ఐ. శ్రీనివాసన్, సీహెచ్.సాంబశివరావు, ఏఎస్సై పి. రంగనాయకులు, కానిస్టే బుల్ ఎం.సత్యనారాయణ.. ఈ బృందంలో ఉంటారని సీఐడీ న్యాయవాదులు న్యాయస్థానానికి వివరించారు.
పూర్తిగా చదవండి..Chandrababu Custody: నేడు చంద్రబాబును ప్రశ్నించనున్న సీఐడీ అధికారులు..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబును సీఐడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం 9.30 గంటల నుంచి ఆయనను విచారించనున్నారు. చంద్రబాబును విచారించేందుకు విజయవాడ నుంచి రాజమండ్రికి బయలుదేరారు సీఐడీ అధికారులు. 12 మందితో కూడిన బృందం.. చంద్రబాబును విచారించనుంది.
Translate this News: