నటుడు నవదీప్ చుట్టు డ్రగ్స్ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంది. హైకోర్టులో అతను వేసి పిటిషన్ కొట్టివేయండతో నార్కోటిక్ పోలీసులు ఈరోజు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేశారు. ఎక్కడున్నా వెంటనే హైదరాబాద్ కు తిరిగిరావాలని చెప్పారు. డ్రగ్స్ కేసుకు తనకూ ఏం సంబంధం లేదని, విచారణకు హాజరు కానని హైకోర్టులో నవదీప్ పిటిషన్ వేశారు. గతంలో ఉన్న డ్రగ్స్ కేసుల్లో నవదీప్ నిందితుడిగా లేడని.. గతంలోనూ దర్యాప్తు సంస్థల ముందు నవదీప్ హాజరయ్యారని.. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ కు అసలు ఎలాంటి సంబంధం లేదని అతని తరపు న్యాయవాది సిద్దార్థ్ వాదించారు. కానీ కోర్టు ఈ పిటిషన్ ను కొట్టేసింది. ఈ క్రమంలో తాజాగా నవదీప్ కు 41ఏ నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
పూర్తిగా చదవండి..Hero Navadeep Drugs Case: నవదీప్ కు షాక్.. నార్కోటిక్ పోలీసుల నోటీసులు.. అసలేమైందంటే?
నవదీప్ కు నార్కోటిక్ పోలీసులు నోటీసులను జారీ చేశారు. ఈనెల 23 వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేశారు. 41 A కింద నార్కోటిక్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
Translate this News: