Chandrababu Naidu Arrest Updates: తన తండ్రి నారా చంద్రబాబు నాయుడిని చంపేందుకు సీఎం జగన్ కుట్ర చేశారని నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిరాధారమైన ఆరోపణలో అరెస్ట్ చేయించి, జైల్లోనే అంతమొందించే కుట్రలు చేస్తున్నారని, తాజా పరిణామాలు ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేసిన లోకేష్.. ‘సైకో జగన్.. చంద్రబాబుని అక్రమ అరెస్ట్ చేయించింది, జైలులోనే అంతం చేసేందుకే అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి బెయిల్ రాకుండా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు. జెడ్ ప్లస్ భద్రతలో ఉన్న ప్రతిపక్షనేతకి జైలులో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర సాగుతోంది. చంద్రబాబుకి జైలులో భద్రత లేదు. విపరీతమైన దోమలు కుడుతున్నాయని చెప్పినా జైలు అధికారులు పట్టించుకోవడం లేదు. జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ డెంగ్యూ బారినపడి మరణించాడు. చంద్రబాబును కూడా ఇలాగే చేయాలని సైకో జగన్ కుతంత్రాలు చేస్తున్నారు. చంద్రబాబుకు ఏం జరిగినా సైకో జగన్ దే బాధ్యత’ అంటూ ముఖ్యమంత్రి జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు.
పూర్తిగా చదవండి..Chandrababu Arrest: చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతోంది.. నారా లోకేష్ సంచలన ఆరోపణలు..
తన తండ్రి నారా చంద్రబాబు నాయుడిని చంపేందుకు సీఎం జగన్ కుట్ర చేశారని నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిరాధారమైన ఆరోపణలో అరెస్ట్ చేయించి, జైల్లోనే అంతమొందించే కుట్రలు చేస్తున్నారని, తాజా పరిణామాలు ఆ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని అన్నారు.
Translate this News: