జరిగిందేదో జరిగిపోయింది.. పాస్ట్ ఈజ్ పాస్ట్.. ప్లాష్బ్యాక్లోనే ఉంటే అసలు సినిమా ఇచ్చే మజాను మిస్ అవుతాం. ఈ విషయం అందరికి తెలుసు.. అయినా కూడా చాలామందిని చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. గతంలో ప్రేమ విషయంలో జరిగిన పొరపాట్లు పదేపదే గుర్తొస్తాయి. కొత్త ప్రేమ జీవితంలోకి అడుగుపెట్టినా కూడా పాత ఘటనలే మనల్ని తరముతుంటాయి. దీని వల్ల కొత్త లవ్ పార్టెనర్ చాలా ఇబ్బందులు వస్తాయి. అబ్బాయిలు, అమ్మాయిల్లో కొంతమంది ఇలానే ఉంటున్నారు. తొలి ప్రేమ ఫెయిల్ అవ్వడానికి జరిగిన పరిణామాలను కొత్త ప్రేమతో ముడి పెడుతుంటారు. ఇలా చేయవద్దు. నిజానికి చాలామందికి తమ బిహెవియర్ ఇలా ఉంటుందని తెలియదు.. పాత ప్రేమ కొత్త ప్రేమను ప్రభావితం చేస్తుందన్న విషయం కూడా అర్థంకాదు.
పూర్తిగా చదవండి..Relationship tips: మీ గతం మీ ప్రస్తుత ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తుందా? అయితే ఇది చదవండి!
మొదటి ప్రేమ ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదే. కొన్నిసార్లు పరిస్థితులు కుదరక విడిపోతారు. తర్వాత కొత్త లవ్ లైఫ్ని స్టార్ట్ చేస్తారు. అయితే మీ గత సంబంధం మీ కొత్త ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తే సమస్యలు తప్పవు. అటాచ్మెంట్ స్టైల్, రొమాన్స్, ఇలా అనేక విషయాల్లో ఏ ఇద్దరి మధ్య పోలికలు ఉండవని గుర్తుపెట్టుకోండి.
Translate this News: