TDP-Janasena Allinace: గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్లే ఓట్లు చీలి జగన్ అధికారంలోకి వచ్చారంటూ చెబుతున్న పవన్ (Pawan kalyan) ఈసారి వైసీపీని (YSRCP) గట్టి దెబ్బ కొట్టాలని డిసైడ్ అయ్యే పొత్తుమాట ఎత్తినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. జనసేనతో టీడీపీకి పొత్తు పెద్దగా అక్కర్లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో…చంద్రబాబు అరెస్ట్ అవడంతో ఆ పార్టీకి కూడా జనసేన బలం అవసరమే అని అంటున్నారు. ఇక జనసేన పార్టీకి (Janasena Party) అయితే ఈ పొత్తు తప్పనిసరి. ఒంటరిగా పోటీ చేస్తే గతంలో లాగే గెలుపు ఏమీ ఉండదనే విషయం ఆ పార్టీకి కూడా బాగా తెలుసు. గత ఎన్నికల్లో ఒక్కసీటు గెల్చుకుని పార్టీ పరువు పోగొట్టుకున్న పవన్ సేన ఈసారి ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకుని కొన్ని స్థానాల్లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే ఎన్డీఏలో చేరి బీజేపీకి జైకొట్టింది. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంది.
పూర్తిగా చదవండి..TDP-Janasena Allinace: టీడీపీ-జనసేన పొత్తు లాభమా…నష్టమా…ఎవరి వాటా ఎంత?
ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు అనే చెప్పొచ్చు. అందుకే అంతటా ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. వైసీపీకి చెక్ పెట్టేందుకే ఇప్పుడు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే అయినా టీడీపీ, జనసేన పార్టీల్లో ఈ పొత్తు ఎవరికి ఎక్కువ లాభం అని తెగ చర్చించేసుకుంటున్నారు. క్రితం ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలచుకుని నవ్వులు పాలైన జనసేన ఈసారి అయినా టీడీపీ పొత్తుతో కనీస గౌరవనీయమైన స్థానాలు సంపాదించుకోవచ్చని అనుకుంటోంది.
Translate this News: