Allu Arjun and Shah Rukh Khan on Twitter: షారూఖ్ ఖాన్…బాలీవుడ్ కీ బాద్షా. ఇతనిని ఢీకొట్టే మరో హీరో లేడు అక్కడ ఇంతవరకు. అలాగే అల్లు అర్జున్…తాజాగా వచ్చిన నేషనల్ అవార్డ్ తో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. పాన్ ఇండియా హీరోగా ఎదిగి…వరల్డ్ వైడ్ గా కూడా స్టార్ డమ్ సంపాదించుకుంటున్నాడు. అలాంటి వీరిద్దరూ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది. అది కూడా మీ సినిమా బావుందని ఒకరు అంటే అయ్యో మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకున్నాని మరొకరు చెప్పుకుంటూ ఉంటే మజా వస్తుంది కదూ. సరిగ్గా అదే జరిగింది. తాజాగా రిలీజ్ అయిన షారూఖ్ ఖాన్ సినిమా మీద అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించాడు. మొత్తం సినిమా యూనిట్ ను అభినందిస్తూ ట్వీట్ చేశాడు బన్నీ. అందులో బాద్షా గురించి ప్రత్యేకంగా చెబుతూ…మీ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమా…మీ స్టైల్ తో మొత్తం ఇండియానే షేక్ చేశారు. మిమ్మల్ని ఇలా చూడ్డం ఆనందంగా ఉంది అంటూ రాసుకొచ్చాడు. అలాగే విజయ్ సేతుపతి , దీపిక, నయనతార ల గురించి కూడా మెన్షన్ చేశాడు.
పూర్తిగా చదవండి..Allu Arjun-Shah Rukh Khan: వైరల్ అవుతున్న అల్లు అర్జున్-షారూఖ్ ఖాన్ ఎక్స్(ట్విట్టర్) సంభాషణ
ఇద్దరు పెద్ద యాక్టర్లు మాట్లాడుకుంటే భలే ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అల్లు అర్జున్, షారూఖ్ ఖాన్ మధ్య జరిగిన చిట్ చాట్ గురించి సరిగ్గా ఇలాగే అనుకుంటున్నారు నెటిజన్లు. మీ సినిమా అదిరిపోయింది అని ఒకరంటే...మీ దగ్గర నుంచి ఎంతో నేర్చుకున్నాని మరొకరు అంటున్నారు.
Translate this News: