Chandrayaan-3 Highlights : విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి సిద్ధంగా ఉంది. చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ ల్యాండ్ కావడానికి ఇప్పుడు కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చంద్రయాన్ 3 (విక్రమ్ ల్యాండర్) యొక్క ల్యాండర్ ఆగస్టు 23, 2023 న సాయంత్రం 6.4 గంటలకు చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. ఇదిలా ఉండగా, విక్రమ్ ల్యాండర్ రెండవ సారి విజయవంతంగా డీబూస్టింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు చంద్రుడి నుంచి ల్యాండర్ దూరం కేవలం 25 కి.మీ.మాత్రమే ఉంది. ఈ కక్ష్య నుండి బుధవారం చంద్రుని యొక్క నిర్దేశించని దక్షిణ ధ్రువ ప్రాంతంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తుందని ఇస్రో (ISRO) తెలిపింది. రోవర్‌తో పాటు ల్యాండర్ మాడ్యూల్ ఆగస్టు 23న సాయంత్రం 6.4 గంటలకు చంద్రుడి ఉపరితలంపై దిగే అవకాశం ఉందని ఇస్రో ఆదివారం తెలిపింది.
పూర్తిగా చదవండి..Chandrayaan-3 : మరోసారి కొత్త ఫొటోలు పంపిన చంద్రయాన్-3.. అబ్బురపరుస్తున్న పిక్స్..!!
విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న సాయంత్రం 6.4 గంటలకు చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్‌తో భారతదేశం చరిత్ర సృష్టించనుంది.ఇస్రో చంద్రయాన్-3ని జూలై 14న ప్రయోగించింది. తాజాగా మరోసారి కొత్త ఫొటోలను పంపించింది చంద్రయాన్ -3. చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితలానికి అతిదగ్గరగా చేరుకుంది. ఈ ఫొటోలను ఇస్రో షేర్ చేసింది.
Translate this News: