PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఫ్యామిలీలోకి కొత్త వ్యక్తి వచ్చారంటూ ఓ ఆసక్తికర వీడియోను దేశ ప్రజలతో షేర్ చేసుకున్నారు. ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ లో అధికారిక నివాసం ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఇందులో ఓ ఆవు లేగ దూడకు జన్మనిచ్చింది. అయితే ఆ దూడకు నామకరణం చేసిన మోదీ.. సోషల్ మీడియా వేదికగా ఈ శుభసందర్భాన్ని అందరితో పంచుకున్నారు.
పూర్తిగా చదవండి..PM Modi: ప్రధాని ఫ్యామిలీలోకి కొత్త వ్యక్తి.. క్యూట్ వీడియో షేర్ చేసిన మోదీ!
ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ అధికారిక నివాసంలో లేగ దూడ జన్మించినట్లు తెలిపారు ప్రధాని మోదీ. నుదుటిపై కాంతికి చిహ్నంగా ఒక ప్రత్యేకమైన గుర్తుతో పుట్టిన లేగకు ‘దీప్జ్యోతి’ అనే పేరు పెట్టారు మోదీ. దానికి శాలువా కప్పి ప్రత్యేక పూజలు చేసిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Translate this News: