Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లోనూ బిజినెస్ మ్యాన్ అనిపించుకుంటున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఇంకోవైపు కొన్ని బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ యాడ్స్ లో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఖాతాలో మల్టీప్లెక్స్ బిజినెస్, రెస్టారెంట్, క్లాతింగ్ బ్రాండ్స్ ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Mahesh Babu : మరో బిజినెస్ లోకి మహేష్ బాబు ఎంట్రీ..
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మరో బిజినెస్ లోకి అడుగుపెట్టనున్నాడట. హైదరాబాద్ కు చెందిన 'వెల్నెస్ బ్రాండ్ ఫిట్ డే' అనే స్టార్టప్ కంపెనీలో మహేశ్ పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీ హెల్త్ సప్లిమెంట్స్ ప్రోటీన్, చిప్స్, ప్రోటీన్ బార్ ఉత్పత్తులను అమ్మనుంది.
Translate this News: