Janhvi Kapoor: నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. బాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే మంచి పాత్రలను పోషించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంది. ఇక టాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది ఈ ముద్దుగుమ్మ. స్టార్ హీరో ఎన్టీఆర్ సరసన ‘దేవర’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటల్లో జాన్వీ.. ఎన్టీఆర్ పోటీగా స్టెప్పులేసి ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో జాన్వీ దేవర ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది.
పూర్తిగా చదవండి..Janhvi Kapoor: కరణ్ తారక్ తో అలా చేయమని చెప్పడం బాగా కలిసొచ్చింది.. జాన్వీ కామెంట్స్ వైరల్
జాన్వీ తనకు కరణ్ జోహార్ మార్గనిర్దేశం ఎంతో సహాయపడిందని తెలిపింది. తమిళ్, తెలుగు రెండింటిలో ఒకేసారి అవకాశాలు వచ్చాయని. అప్పుడు తాను కన్ఫ్యూజన్ లో ఉండగా ‘తారక్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వుమని కరణ్ సలహా ఇచ్చారని. అది తనకు బాగా కలిసొచ్చిందని తెలిపింది.
Translate this News: