Hyderabad Ganesh festival: హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో మహిళలను వేధిస్తున్న పలువురు బ్యాడ్ బాయ్స్ పట్టుబడ్డారు. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనం కోసం క్యూ లైన్లో వస్తున్న మహిళా భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన 285 మంది పోకిరిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం తెలిపింది. అలాగే ఓల్డ్‌సిటీలో పలు ఉత్సవాల్లో కొందరు వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తిస్తూ భక్తుల పట్ల నీచంగా ప్రవర్తిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని షీ టీమ్స్ అదుపులోకి తీసుకున్నాయి. వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
పూర్తిగా చదవండి..Hyderabad Ganesh festival: గణేష్ ఉత్సవాల్లో రెచ్చిపోతున్న బ్యాడ్ బాయ్స్.. అడ్డంగా బుక్కైన 285 మంది!
హైదరాబాద్ గణేష్ ఉత్సవాల్లో మహిళలను వేధిస్తున్న 285 మంది బ్యాడ్ బాయ్స్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖైరతాబాద్ బడా గణేష్, ఓల్డ్ సిటీ, తదితర బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధించేవారిని షీ టీమ్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. మహిళలు బయపడకుండా రిపోర్ట్ చేయాలని తెలిపారు.
Translate this News: