Health Tips: వర్షాకాలం అనేక అనారోగ్య సమస్యలు రావడం సర్వసాధారణం. పిల్లల్లో పెద్దల్లో ఎక్కువగా జలుబు, గొంతు నొప్పి, గొంతు గరగర వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం వలన వైరల్ జ్వరాలు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రావడానికి కారణమని చెప్పవచ్చు. అయితే వీటితోపాటు జీర్ణ సమస్యలు, దగ్గు, కీళ్ల నొప్పులు వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ చిన్న వాటికి ఆస్పత్రిలోకి వెళ్తూ చికిత్స తీసుకుంటారు. అయితే గొంతులో గరగర జలుబు అజీర్తి , చిన్న సమస్యలకు ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేదిక నిపుణులు. అల్లం రాతి ఉప్పు ఈ సమస్యలను పోగొట్టడంలో అద్భుతంగా పనిచేస్తుందట. మరి వీటిని ఏ విధంగా వాడాలో దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు ఈ ఆర్టికల్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Health Tips: వర్షాకాలపు సంజీవని.. ఈ రెండిటితో గొంతులో గరగరకు చెక్!
వర్షాకాలంలో జలుబు, గొంతులో గరగర సమస్యలు వస్తాయి. అల్లం చిన్న ముక్కలుగా తీసుకొని రాతి ఉప్పును దానిపై కొంచెం చల్లాలి. భోజనానికి పది నిమిషాలు ముందు దీనిని తినాలి. ఇలా తినడం వల్ల గొంతులో గరగర వెంటనే తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: