DMD: డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (DMD) దీనిని ‘పీడియాట్రిక్ న్యూరోమస్కులర్ డిజార్డర్’ అని కూడా అంటారు. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. ప్రధానంగా మగ పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి కారణంగా కండరాల బలహీనత ఏర్పడుతుంది. సాధారణంగా నాలుగు సంవత్సరాల వయస్సులో మొదలై ఊహించనంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే జన్యువులోపం వల్ల మగ పిల్లలో సంభవించే వంశపారంపర్య నాడీ కండరాల రుగ్మతగా వైద్యులు పేర్కొన్నారు. ఇది సోకిన వారు తీవ్రమైన కండరాల క్షీణతకు లోనవుతారు. నడవలేకపోవడం, శ్వాసకోశ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇటీవల రామ, ఆదిత్య అనే ఇద్దరు అన్నదమ్ములు డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.
పూర్తిగా చదవండి..DMD: మగపిల్లలను వేధిస్తున్న ప్రాణాంతక వ్యాధి.. చచ్చుబడిపోతున్న శరీరాలు!
రామ, ఆదిత్య అనే ఇద్దరు అన్నదమ్ములు 'డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ' వ్యాధి బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. జన్యువులోపం వల్ల మగ పిల్లలో సంభవించే రుగ్మతపై సినీ నటుడు అవసరాల శ్రీనివాస్ అవగాహన కల్పిస్తున్నారు. దీని గురించి మరింత ప్రచారం చేయాలని కోరుతున్నారు.
Translate this News: