SIIMA Winners List 2024: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) వేడుకలు సెప్టెంబర్ 14, 15న దుబాయి వేదికగా అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. నిన్న శనివారం సాయంత్రం తొలిరోజు అవార్డ్స్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నటీనటులు హాజరై సందడి చేశారు. మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన అవార్డులను ప్రకటించారు. 2023లో విశేష ప్రతిభను కనబరిచిన నటీనటులకు, చిత్రబృందాలకు అవార్డులను అందించారు.
కన్నడలో రక్షిత్ శెట్టి సప్త సాగరదాచే ఎల్లో – సైడ్ ఎ, నాని దసరా, హాయ్ నాన్న పలు విభాగాల్లో అవార్డులు గెలుచుకొని సత్తా చాటాయి. హయ్ నాన్న , దసరా సినిమాలకు గానూ మృణాల్ ఠాకూర్, కీర్తిసురేష్ ఉత్తమ నటీమణులుగా అవార్డును గెలుచుకున్నారు. అలాగే ‘దసరా’ సినిమాకు ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల అవార్డు సొంతం చేసుకున్నారు. కన్నడలో ‘కాటేరా’ ఉత్తమ చిత్రంగా , తెలుగులో నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి ఉత్తమ చిత్రంగా నిలిచాయి. విజయ్ దేవర కొండ బెస్ట్ క్రిటిక్స్(బేబీ) విభాగంలో ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు.
సైమా అవార్డ్స్ 2024 విజేతలు
- బెస్ట్ యాక్టర్: నాని (దసరా)
- ఉత్తమ నటి: కీర్తి సురేశ్ (దసరా)
- ఉత్తమ దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా)
- ఉత్తమ చిత్రం: భగవంత్ కేసరి
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్): ఆనంద్ దేవరకొండ (బేబీ)
- ఉత్తమ నటి (క్రిటిక్స్): మృణాళ్ ఠాకూర్
- ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్): సాయి రాజేశ్
- ఉత్తమ సహాయ నటి: బేబీ కియారా ఖాన్ (హాయ్ నాన్న)
- ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా)
- ఉత్తమ హాస్య నటుడు: విష్ణు (మ్యాడ్)
- బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్: వైష్ణవి చైతన్య (బేబీ)
- ఉత్తమ సహాయ నటుడు: దీక్షిత్ శెట్టి (దసరా)
- ఉత్తమ సంగీత దర్శకుడు: అబ్దుల్ వాహబ్ (హాయ్నాన్న, ఖుషి)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: భువన గౌడ (సలార్)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: రామ్ మిర్యాల (ఊరు పల్లెటూరు-బలగం)
- బెస్ట్ డెబ్యూ యాక్టర్: సంగీత్ శోభన్ (మ్యాడ్)
- బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : శౌర్యువ్ (హాయ్ నాన్న)
- బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ : వైరా ఎంటర్టైన్మెంట్స్ (హాయ్ నాన్న)
Also Read: Thangalaan: అప్పుడే ఓటీటీ విడుదలకు సిద్దమైన ‘తంగలాన్’..! – Rtvlive.com