Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అప్పుడప్పుడు తన కూతురు అర్హకు సంబంధించిన క్యూట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అర్హ కూడా వీడియోస్ లో తన ముద్దు ముద్దు మాటలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అయితే నేడు వినాయక చవితి సందర్భంగా అర్హ తన నాన్నమ్మ తో కలిసి గణపతి పూజ చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. వీడియోలో అర్హ చక్కగా సాంప్రదాయ వస్త్రాలను ధరించి తన నానమ్మకు తోడుగా పూజలో కూర్చుంది. ఈ వీడియో చూసిన బన్నీ అభిమానులు వీడియో పై లైకులు వర్షం కురిపిస్తున్నారు. ‘సో క్యూట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
పూర్తిగా చదవండి..Allu Arjun: అల్లు అర్హ ఎంత చక్కగా గణపతి పూజ చేసిందో చూశారా.? వీడియో షేర్ చేసిన బన్నీ
నేడు వినాయక చవితి సందర్భంగా అల్లు అర్హ తన నాన్నమ్మతో కలిసి గణపతి పూజ చేసింది. ఇందుకు సంబంధించిన అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇది చూసిన బన్నీ అభిమానులు 'సో క్యూట్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Translate this News: