Hyderabad Traffic: గణపతి ఉత్సవాల కారణంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 7 నుంచి గణేష్ నిమజ్జనాలు ముగిసే సెప్టెంబర్ 17 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. ఇందులో భాగంగా కొన్ని రోడ్లను పూర్తిగా మూసి వేయగా మరికొన్ని మార్గాల్లో సమయాలను కేటాయించారు. ఈ మేరకు ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక ఖైరతాబాద్ వచ్చే భక్తులు, సందర్శకులు.. నెక్లెస్ రోడ్, ఐమాక్స్ రోటరీ వైపు నుంచి రావాలని సూచించారు. భారీ అంబేద్కర్ విగ్రహం పక్కన పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
పూర్తిగా చదవండి..Hyderabad Traffic: హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
గణపతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 7 నుంచి 17 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ చెప్పారు. వాహనదారులు సహకరించి, తాము సూచించిన రూట్లో వెళ్లాలని కోరారు.
Translate this News: