Allu Arjun – Sukumar As A Chief Guests : రావు రమేష్ (Rao Ramesh) లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ (Maruthi Nagar Subramanyam). ఈ చిత్రాన్ని పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పణలో రూపొందింది. ఆమెకు సినిమా కథ నచ్చి మరీ మూవీ టీమ్ లో జాయిన్ అయ్యారట. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని శ్రద్దగా పర్యవేక్షిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 23న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇక ఈ సినిమాను సుకుమార్ భార్య తబిత ప్రజెంట్ చేస్తుండడంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా ప్లాన్ చేశారు. ఈ రోజు జరగబోయే ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ప్రీరిలీజ్ వేడుకకు అల్లు అర్జున్, సుకుమార్ ముఖ్య అతిథులుగా రావడం సెన్సెషన్ గా మారింది.
పూర్తిగా చదవండి..Maruthi Nagar Subramanyam : ప్రీ రిలీజ్ కు చీఫ్ గెస్టుగా బన్నీ.. ఆ అంశంపై స్పందిస్తారా?
రావురమేష్ నటిస్తున్న 'మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం' ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు హైదరాబాద్ లో జరగనుంది. ఈ వేడుకకు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నారు. దీంతో ఈ వేదిక నుంచి చిరంజీవి ఫ్యామిలీతో విభేదాలపై బన్నీ స్పందిస్తారా? అన్న చర్చ ఫ్యాన్స్ లో జోరుగా సాగుతోంది.
Translate this News: