Pawan Kalyan: సాంకేతిక మంత్రిగా ఉన్నా.. ఇస్రోకు (ISRO) నిధులు కేటాయించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఉన్నాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శ్రీహరికోటలో (Sriharikota) ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు రాకెట్ ప్రయోగాలు అంటే నాసా (NASA) గుర్తుకు వచ్చేదని.. కానీ, నేడు మన శాస్త్రవేత్తలు ప్రపంచ దేశాలకు భారత దేశ ఖ్యాతిని చూపించారన్నారు. ఎందరో శాస్త్రవేత్తల త్యాగ ఫలితంగా ఈ రోజు ప్రపంచ దేశాలకు మించి మన రాకెట్ ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: నేను మంత్రిగా ఉన్నా.. ఏమీ ఇవ్వలేక పోతున్నా : పవన్ కళ్యాణ్
తాను సాంకేతిక మంత్రిగా ఉన్నా కూడా ఇస్రోకు నిధులు కేటాయించలేని పరిస్థితిలో ఉన్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉండడమే ఇందుకు కారణమన్నారు. ఇస్రోకు వెళ్లడానికి సైంటిస్టులు ప్రయాణించే రోడ్లు సరిగా లేవన్నారు. త్వరలో ఆ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.
Translate this News: