Secunderabad: సికింద్రాబాద్ లోని అవినాష్ కామర్స్ కాలేజీ ఫ్రెషర్స్ పార్టీ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. సీనియర్లు, జూనియర్లు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అవినాష్ కాలేజీ యాజమాన్యం సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్ లో ఫ్రెషర్స్ పార్టీ ఏర్పాటు చేసింది. సీనియర్ స్టూడెంట్లు డ్యాన్స్ చేస్తుండగా, జూనియర్ స్టూడెంట్లు కొందరు తోశారు. ఈ క్రమంలో సీనియర్లు జూనియర్లను కొట్టారు. అక్కడే ఉన్న యాజమాన్యం వారిని సముదాయించి.. ఆ వెంటనే పార్టీని ముగించి అందరినీ ఇండ్లకు పంపించారు.
పూర్తిగా చదవండి..Secunderabad: ఫ్రెషర్స్ పార్టీ.. కొట్టుకున్న సీనియర్లు, జూనియర్లు..!
సికింద్రాబాద్ లోని అవినాష్ కామర్స్ కాలేజీ ఫ్రెషర్స్ పార్టీలో స్టూడెంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీనియర్లు, జూనియర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనలో ఇద్దరు సీనియర్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు నలుగురు జూనియర్లపై కేసు నమోదు చేశారు.
Translate this News: