అది ఏప్రిల్ 14, 1865..
ప్రాంతం: వాషింగ్టన్ డీసీ, ఫోర్డ్స్ థియేటర్
తుపాకీ తుటాల శబ్దాలు వినిపించాయి.. కాల్చింది మరెవరినో కాదు.. అమెరికా 16వ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్‌ను. ‘అవర్ అమెరికన్ కజిన్’ అనే డ్రామాను ఫోర్డ్స్ థియేటర్లో చూస్తున్న అబ్రహం లింకన్‌ను జాన్ విల్క్స్బూత్ కాల్చిచంపాడు. శ్వేత జాత్యహంకారులు లింకన్‌పై చేసిన కుట్ర ఇది. అంతకముందు జనవరి 1,1863న ‘బానిస విముక్తి’ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన లింకన్‌పై కక్ష పెంచుతున్న జాత్యహంకారులు లింకన్‌ను జాన్ చేత హత్య చేయించారు.
US Presidents Assassinations and Attempts: అమెరికా చరిత్రంతా హత్యలు, హత్యాయత్నాలే.. లింకన్ నుంచి ట్రంప్ వరకు.. !
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటనతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. గతంలోనూ అమెరికా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులపై హత్యాయత్నాలు జరిగాయి. లింకన్, కెన్నెడి అధ్యక్షులుగా ఉన్న సమయంలో హత్యకు గురయ్యారు. బుష్, బిల్ క్లింటన్లు తృటిలో తప్పించుకున్నారు.
Translate this News: