Komati reddy: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో అన్ని విషయాలు బయటపడుతున్నాయని.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదన్నారు. అలాగే హరీష్ రావు అమెరికా వెళ్లి రావడంపై కోమటిరెడ్డి పలు ఆరోపణలు చేశారు. ఆదివారం తెలంగాణ పదేళ్ల ఆవిర్భవం సందర్భంగా మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి.. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలిపించేందుకు మే 26న ఎమిరేటెస్ ఫ్లైట్ నెంబర్ Ek 525లో హరీష్ రావును కేసీఆర్ అమెరికా పంపించినట్లు చెప్పారు.
పూర్తిగా చదవండి..TG News: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ తప్పదు.. మంత్రి కోమటిరెడ్డి
కేసీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'కేసీఆర్ తెలంగాణ జిన్నా లాగా మారిండు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ కాక తప్పదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన ప్రభాకర్ రావును కలవడానికే హరీష్ అమెరికా వెళ్లాడు' అంటూ ఆరోపించారు.
Translate this News: