All Eyes On Rafah: ఇజ్రాయిల్ – గాజా మధ్య యుద్దం తీవ్రత మరింతగా పెరిగింది. ఇటీవల దక్షిణ గాజాలోని రఫా నగరంలో ఇజ్రాయిల్ జరిపిన దాడిలో శరణార్థి శిబిరంలోని చిన్నారులతో పాటు 45 మంది వరకు మరణించారు. ఈ విషయం ప్రపంచాన్ని కదిలించింది. దీంతో ప్రపంచం వ్యాప్తంగా ప్రముఖులు, క్రీడాకారులు మిలియన్ల సంఖ్యలో సోషల్ మీడియాలో ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’’ అనే హ్యాష్‌ట్యాగ్‌ని విపరీతంగా ట్రెండ్ చేశారు.
పూర్తిగా చదవండి..All Eyes On Rafah: అప్పుడు మీ అందరి కళ్లు ఎక్కడ ఉన్నాయి…ఆల్ ఐస్ ఆన్ రఫా పై ఇజ్రాయిల్ సీరియస్!
ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఎక్స్ వేదికగా, రఫాపై పోస్టు పెడుతున్న వారిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘‘ అక్టోబర్ 7న మీ కళ్లు ఎక్కడ ఉన్నాయి. మేమే అక్టోబర్ 7 గురించి మాట్లాడటం ఆపము, మేము బందీల కోసం పోరాటాన్ని ఎప్పటికీ ఆపము’’ అని ఆయన స్పష్టం చేశారు.
Translate this News: