Rave Party – Hema : బెంగళూరు రేవ్ పార్టీ కేసు (Bangalore Rave Party Case) లో అరెస్టైన నిందితులతో పాటు మరికొందరి అనుమానితులను కూడా పోలీసులు ఈరోజు విచారించనున్నారు. ఇప్పటికే ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఆరుగురి బ్యాంకు ఖాతాలను అధికారులు సీజ్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న విజయవాడ వాసి అయిన లంకిపల్లి వాసు (Lankipalli Vasu) అకౌంట్ లో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
పూర్తిగా చదవండి..Rave Party : నేడే నటి హేమ విచారణ.. అరెస్ట్ చేస్తారా?
బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం 103 మంది పాల్గొనగా..వారిలో 86 మంది మాదకద్రవ్యాలను తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. వారిలో టాలీవుడ్ కు చెందిన నటి హేమ కూడా ఉంది. ఈరోజు ఆమెతో కలిసి మొత్తంగా ఎనిమిది మందిని విచారణకు సోమవారం హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు.
Translate this News: