UFO: గ్రహాంతర వాసుల గురించి వింటూనే ఉన్నాం. ఎప్పటి నుంచో ఎక్కడో అక్కడ వీటికి సంబంధించిన కథలు వినిపిస్తూనే వస్తున్నాయి. గ్రహాంతర వాసులు- UFOల గురించి ప్రపంచవ్యాప్తంగా వివిధ వాదనలు ఉన్నాయి. కొంతమంది గ్రహాంతరవాసులు ఉన్నారని, వారు సుదూర విశ్వంలో ఎక్కడో నివసిస్తున్నారని నమ్ముతారు. కానీ, వారి ఆచూకీ మాత్రం ఇప్పటివరకూ ఎవరికీ తెలీదు. అయితే కొంతమంది ఈ విషయాలను కేవలం వదంతులుగా కొట్టి పారేస్తారు. అయితే, ఎప్పుడైనా ఏదో ఒక రహస్యమైన కాంతి లేదా ఏదైనా రహస్యమైన వస్తువు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తే, అది గ్రహాంతరవాసులకు సంబంధించింది ఏమో అని అంతా అనుకుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అలాంటి దృశ్యం కనిపించడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
పూర్తిగా చదవండి..UFO: బీ ఎలర్ట్.. ఏలియన్స్ వచ్చేశాయ్.. కలకలం రేపుతున్న నీలిరంగు కాంతి
స్పెయిన్లో ఆకాశంలో ఒక నీలిరంగు కాంతిని చాలామంది చూశారు. రాత్రి సమయంలో ఆకాశాన్ని ప్రకాశవంతం చేస్తూ భూమివైపు దూసుకు వచ్చిన ఈ కాంతిని కొందరు UFO అని అంటున్నారు. మరికొందరు మాత్రం అదేమీ కాదు ఇది కేవలం ఒక ఉల్క అని కొట్టిపడేస్తున్నారు. అయితే, ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.
Translate this News: