Animal: టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా, బాలీవుడ్ యంగ్ హీరో రణ్ బీర్ కపూర్ కాంబోలో వచ్చిన ‘యానిమల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టి బిగ్ హిట్ అయింది. అయితే ఈ సినిమాకు యువతనుంచి విశేష స్పందన లభించినప్పటికీ సమాజం నుంచి మాత్రం విమర్శలు వెల్లువెత్తాయి. ఈ కథలో పురుషాధిక్యతను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ.. మహిళలను దారుణంగా కించపరిచారంటూ పలువురు ప్రముఖులు, సినీ నటులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Bollywood: గర్ల్ ఫ్రెండ్ తో బూట్లు నాకించిన స్టార్ హీరో.. దుమ్మెత్తి పోస్తున్న నటులు!
'యానిమల్' మూవీలో రణ్ బీర్ తన బూటు నాకమని ప్రియురాలు త్రిప్తి డిమ్రికి సూచించే సన్నివేశంపై విద్యావేత్త, నటుడు వికాస్ దివ్యకృతి మండిపడ్డారు. ఇలాంటి సినిమాలు సమాజానికి చాలా ప్రమాదకరమన్నారు. యువతకు ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Translate this News: