My Dear Donga : అభినవ్ గోమటం(Abhinav Gomatam), నిఖిల్ షాలిని(Nikhil Shalini), దివ్య శ్రీపాద(Divya Sripada) నటించిన మై డియర్ దొంగ మూవీ టీమ్ మంగళవారం విశాఖలో సందడి చేసింది. ఈ మేరకు నగరంలోని ఒక హోటల్ లో జరిగిన మీడియా సమావేశంలో హీరో అభినవ్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఈనెల 19 న విడుదల అవుతుందని చెప్పారు. మంచి కంటెంట్ వున్న చిత్రం ఇది. ఇందులో తాను దొంగగా నటించాను అని చెప్పారు. చాలా క్లారిటీ వున్న దొంగ అన్నారు. అత్యాస లేకుండా అవసరాల కోసం మాత్రమే దొంగతనాలు చేస్తానని చెప్పారు. గతంలో మంచి దొంగ, అడవి దొంగ, జేబు దొంగ సినిమాలు వచ్చాయి అని గుర్తు చేశారు.
పూర్తిగా చదవండి..Abhinav : అత్యాసలేని ‘మై డియర్ దొంగ’.. అందరికీ కనెక్ట్ అవుతుందట!
'మై డియర్ దొంగ' మూవీ టీమ్ విశాఖలో సందడి చేసింది. ఏప్రిల్ 19 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుండగా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. దొంగగా నటించిన అభినవ్ తాను చాలా క్లారిటీ వున్న దొంగ అన్నారు. అత్యాసలేకుండా అవసరాల కోసం మాత్రమే దొంగతనాలు చేస్తానని చెప్పి అలరించాడు.
Translate this News: