Kalki 2898 AD Release Date: పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తోంది అంటే అభిమానులకు పండగే. ఇటీవలే సలార్ తో ఇండియన్ స్క్రీన్ పై సంచలనం సృష్టించిన ప్రభాస్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు చాలా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ (Prabhas) లైనప్ కూడా చాలా పెద్దగా ఉంది. అయితే, ఇందులో త్వరలో రిలీజ్ కావడానికి ముస్తాబవుతున్నా సినిమా కల్కి 2898 ఏడి(Kalki 2898 AD). వైజయంతీ మూవీస్ బేనర్ పై సైన్స్ ఫిక్షన్ జానర్ లో భారీస్థాయిలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ప్రేక్షకుల్లో ఉత్కంఠ నింపుతోంది. ఎందుకంటే, దీని దర్శకుడు నాగ్ అశ్విన్ కావడమే. నాగ్ అశ్విన్ (Nag Ashwin) – ప్రభాస్ కాంబినేషన్ అనేసరికి క్రేజీగా మారింది.
పూర్తిగా చదవండి..Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ కి బిగ్ అలర్ట్.. కల్కి రిలీజ్ డేట్ మారింది!
వైజయంతి పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ జానర్ లో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమా కల్కి 2898 ఏడి. మొదట మే 9 వతేదీన సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు రిలీజ్ వాయిదా పడిందని.. జూలై 12న రిలీజ్ అని తెలుస్తోంది.
Translate this News: