మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. టాలీవుడ్.. బాలీవుడ్ ఇలా ఏ వుడ్ లోనైనా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేని పేరు. ఇంతై.. వటుడింతై అన్నట్టు చిన్న నటుడిగా తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చి.. నాలుగున్నర దశాబ్దాలుగా టాలీవుడ్ మెగాస్టార్ గా .. తన ముందు తరానికి.. ఇప్పటి తరానికి మధ్య వారధిలా నిలిచిన లెజండరీ యాక్టర్. ఇప్పటికీ మొదటి సినిమా సమయంలో ఎంత క్రమశిక్షణతో ఉన్నారో.. అంతే క్రమశిక్షణ చిరంజీవిది. ఆయనతో నటించిన తోటి నటులు.. సినిమాలు తీసిన దర్శకులు చెప్పే మాట ఇది. చిరంజీవి(Chiranjeevi) వచ్చాకా మాస్ సినిమాలకి ఒక లెక్క వచ్చింది. అప్పటిదాకా ఒకరకంగా ఉన్న తెలుగు సినిమా ఆ తరువాత మాస్ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చూసింది.
పూర్తిగా చదవండి..Chiranjeevi: మెగాస్టార్ చిరు ఎంతో ఇష్టపడి చేస్తే వచ్చింది జీరో అట..!
ఎంతో ఇష్టపడి చిరంజీవి సొంతంగా కె.బాలచందర్ దర్శకత్వంలో నిర్మించిన రుద్రవీణ సినిమా జాతీయస్థాయిలో అవార్డులు గెలుచుకుంది కానీ.. కలెక్షన్లు రాబట్టలేకపోయింది. ఈ విషయాన్ని ఇటీవల చిరంజీవి సౌత్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ 2024లో చెప్పారు.
Translate this News: