Summer Food : ఈ వేసవిలో ఆహారం విషయంలో చాలా మార్పులు వస్తుంటాయి. అందులో ముఖ్యంగా ప్రతి రోజూ ఆహారంలోకి పప్పు కచ్చితంగా వచ్చి చేరుతుంది. ఈ కాలంలో కాయధాన్యాలకు చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. అయితే ఈ వేసవిలో తీసుకోవాల్సిన పప్పు ఒకటి ఉంది. అదే పెసరపప్పు. ఈ పప్పు హీట్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కడుపునకు బాగా జీర్ణమవుతుంది. పెసర పప్పు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ,అధిక బీపీని నియంత్రించడంలో సహాయపడుతుంది. పెసర పప్పు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. పెసర పప్పు(Moong Dal) ఆరోగ్యానికి ఎందుకు మేలు చేస్తుందో తెలుసా?
పూర్తిగా చదవండి..Moong Dal : ఈ వేసవిలో పెసరపప్పు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా!
పెసర పప్పు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా చెప్పుకోవచ్చు. అనారోగ్యంగా ఉన్నప్పుడు, వైద్యులు ముందుగా సిఫార్సు చేసేది పెసరపప్పు సూప్ తాగడం. దీనికి కారణం ఈ పప్పు కడుపునకు, జీర్ణక్రియకు చాలా మంచిది. పెసర పప్పు తక్షణ శక్తిని ఇస్తుంది.
Translate this News: