Jr NTR Lands in Mumbai for War 2 Movie: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటిస్తున్న వార్ 2 సినిమాలో ఒక కీలక పాత్రలో యంగ్ ఎన్టీఆర్ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. 2018 అరవింద సమేత చిత్రం తర్వాత RRR సినిమాతో ఎన్టీఆర్ ప్రేక్షకులు ముందుకువచ్చాడు. ఈ మూవీతో NTR పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే వార్ 2 అప్డేట్ ప్రకటించినప్పటి నుంచి హృతిక్, ఎన్టీఆర్ కలిసి షూటింగ్లో పాల్గొన్న అప్డేట్స్ కోసం అభిమానులు ఎప్పుడేప్పుడా అని ఆతృుతగా ఎదురుచూశారు. అయితే ఇప్పటికీ అభిమానుల ఆశ తీరనుంది. ఒక 10 రోజుల యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం ఎన్టీఆర్ తాజాగా ముంబయికి చేరుకున్నారు. ఏప్రిల్ 12 నుంచి షూటింగ్ సెట్స్‌లో తారక్ అడుగుపెట్టనున్నారట. అయితే ముంబయికి చేరుకోగానే మీడియా ఎన్టీఆర్‌ను చుట్టుముట్టేసింది. ఫ్యాన్స్ అంతా ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. కానీ తారక్ దూరం నుంచే వాళ్లను చూసి ఫొటోలకు పోజులిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పూర్తిగా చదవండి..Jr NTR: ఎన్టీఆర్ వార్ మొదలెట్టేశాడు..10 రోజులు అక్కడే!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కోసం ముంబాయికి చేరుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సుమారు 10 రోజుల పాటు వార్ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం.
Translate this News: