Cricket: భారత క్రికెట్ జట్టుకు మరో ఆణిముత్యం దొరికింది. సరైన ఆల్ రౌండర్లు లేక చాలా కాలంగా ఇబ్బంది పడుతుండగా తాజాగా ఐపీఎల్ సీజన్ 17లో నికార్సైన తెలుగు తేజం వెలుగులోకి వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతున్న నితీశ్ కుమార్‌రెడ్డి (Nitish Kumar Reddy) తనదైన ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ 20 ఏళ్ల కుర్రాడు అంతర్జాతీయస్థాయి బౌలర్లను అలవోకగా దంచికొడుతున్నాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్, క్లాసెన్ వంటి హిట్టర్లు తడబడిన వేళ కఠినమైన పిచ్‌పై బ్యాటింగ్‌లో విలువైన 64 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో వికెట్ తీసి ఔరా అనిపించాడు.
పూర్తిగా చదవండి..Nitish Kumar: భారత జట్టుకు నికార్సైన ఆల్‌రౌండర్ దొరికాడు.. ఐపీఎల్ లో అదరగొడుతున్న తెలుగు కుర్రాడు!
ఐపీఎల్ సీజన్ 17లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్‌రెడ్డి ఆల్ రౌండ్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అంతర్జాతీయస్థాయి బౌలర్లను అలవోకగా దంచికొడుతున్నాడు. కఠినమైన పిచ్‌పై ఒత్తిడి లేకుండా ఆడటం చూసి భారత జట్టుకు నికార్సైన ఆల్‌రౌండర్ దొరికాడంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.
Translate this News: