Tillu Square: టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘టిల్లు స్క్వేర్’. డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టిన సిద్దు జొన్నల టిల్లు స్క్వేర్తో మరో సారి సక్సెస్ అందుకున్నాడు. మార్చి 29న విడుదలైన ఈ చిత్రానికి అటు ప్రేక్షకులు, ఇటు సినీ విమర్శకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా యువతను ఎంతో ఆకట్టుకుంటోంది ఈ సినిమా. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్ సీస్ లో కూడా టిల్లుగాని హవా కొనసాగుతోంది. వన్ లైనర్స్, పంచ్ డైలాగ్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తోంది.
పూర్తిగా చదవండి..Tillu Square: “ఇది యూనివర్సల్ సినిమా”.. ‘టిల్లు స్క్వేర్’ పై మెగాస్టార్ రియాక్షన్ ఏంటో చూడండి
సిద్దు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ చిత్రం 'టిల్లు స్క్వేర్'. మార్చి 29 రిలీజైన ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం ‘టిల్లు స్క్వేర్’ ను అభినందించారు. "యూనివర్సల్ మూవీ ఇది. దీని కోసం టీమ్ ఎంతో కష్టపడింది" అని ప్రశంసించారు.
Translate this News: