దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ నాండ్రే బెర్గర్ ( Nandre Berger)ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలని కలలో కూడా ఊహించలేదు. ఉచిత చదువుల కోసం ఎంచుకున్న క్రికెట్ తనని ఇంత దూరం తీసుకువస్తుందని అసలు ఊహించలేదు. అతను 2014లో జరిగిన క్రికెట్ ట్రయల్స్ ద్వారా విట్వాటర్రాండ్ విశ్వవిద్యాలయంలో పూర్తి స్కాలర్షిప్ తో ప్రవేశం పొందాడు. అప్పటి నుంచి అతను వెనుదిరిగి చూసుకోలేదు. 28 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ బర్గర్ మూడు ఫార్మాట్లలో దక్షిణాఫ్రికా ప్రధాన బౌలర్ గా దూసుకెళుతున్నాడు. గతేడాది డిసెంబర్లో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బర్గర్ ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. 2024 ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ బర్గర్‌ను రూ.50 లక్షలకు కొనుగోలు చేసింది.
పూర్తిగా చదవండి..cricket:స్కాలర్ షిప్ కోసం క్రికెట్ ఆడిన దక్షణాఫ్రికా ఆటగాడు!
దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ నాండ్రే బెర్గర్ క్రికెట్ కెరీర్ చాలా ఆసక్తికరం. 15 ఏళ్ల వయసులో టెన్నిస్ ఆడాడు. ఉచితంగా చదువుకోవటం కోసం క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. దాంతో క్రికెట్ ఆడుతూ ఉన్నత విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు.
Translate this News: