Children Food: పిల్లలలో ఆకలి కోల్పోవడం అనేది ఒక సాధారణ సమస్య. ప్రతి తల్లిదండ్రులు ఈ సమస్యను ఎదుర్కోక తప్పదు. ఎన్ని రకాల వంటకాలు చేసి పెట్టినా పిల్లలు మాత్రం తినరు. దీంతో తల్లిదండ్రులు గందరగోళంలో పడుతుంటారు. ఆకలి అయ్యేందుకు కొన్ని రకాల టానిక్లు కూడా ఇస్తుంటారు. ఈ పరిస్థితి పిల్లల ఆరోగ్యానికి మాత్రమే కాదు వారి అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఆకలిని కోల్పోవడానికి కారణాలు భిన్నంగా ఉండవచ్చు. కొన్నిసార్లు అకాల ఆహారం, ఒత్తిడి, తక్కువ నిద్ర లేదా అనారోగ్యం కూడా దీనికి కారణం. కానీ భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుందని అంటున్నారు.
పూర్తిగా చదవండి..Children Food: పిల్లల్లో ఆకలిని పెంచే చిట్కాలు..ఇలా చేశారంటే వద్దన్నా తింటారు
పిల్లలకు ప్రతిరోజూ ఒకే సమయంలో ఆహారం ఇస్తే మంచిది. కూరగాయలను వివిధ ఆకారాలలో కత్తిరించడం, వివిధ రంగుల ఆహారాలను వారికి ఇవ్వడం వల్ల పిల్లలకు ఆహారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. పిల్లల ముందు ఎక్కువ ఆహారం పెడితే వారు తినడానికి ఇష్టపడరు.
Translate this News: