What’s Wrong With India : అవతలి వారిని అనేముందు మన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలి. ఇతరుల తప్పులను వెతికే ముందు మనల్ని మనం సరిదిద్దుకోవాలి. ఇది అందరికీ వర్తించే విషయం. లోపాలు లేని దేశం, ప్రాంతం ఈ భూమండలం మీద లేదు. అయితే విదేశీయులకు మాత్రం ఇండియా(India) ను ఎగతాళి చేయడమంటే అదో సరదా. సిగ్నల్ ప్రోటోకాల్‌లను పాటించకపోవడం, నిబంధనలు లేదా క్యూలను ఉల్లంఘించడం, బహిరంగంగా మూత్ర విసర్జన చేయడం, బిచ్చగాళ్లు, ఈవ్ టీజింగ్(Eve Teasing), తాగి వాహనాలు నడపడం లాంటి అనేక సామాజిక, పౌర లోపాల వల్ల భారతీయులను పొరుగు దేశాల వారు చాలా సార్లు ప్రశిస్తూ ఉంటారు. అయితే ఇవన్ని కేవలం ఇండియాలోనే లేవు కదా. తాజాగా ఇండియాను టార్గెట్‌గా చేసుకోని సోషల్‌మీడియా(Social Media) లో పలువురు ఎగతాళి చేస్తున్నారు. మోసం, అవినీతి, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో నిండిపోయిన అమెరికా(America) ముందు ఆత్మపరిశీలన చేసుకోవడం అన్నిటికంటే ముఖ్యం. ఇదే విషయాన్ని భారతీయులు ఎత్తి చూపుతున్నారు. విదేశీయులకు కౌంటర్లు ఇస్తున్నారు. ‘#whatswrongwithindia‘ హ్యాష్ ట్యాగ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ హ్యాష్ ట్యాగ్ చుట్టూ కౌంటర్లు, ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి.
పూర్తిగా చదవండి..What’s Wrong With India : ముందు మీది మీరు చూసుకోండి.. విదేశీయులకు ఇచ్చిపడేసిన ఇండియా!
'what's wrong with India' హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్‌గా మారింది. ఇండియా టార్గెట్‌గా కొందరు విదేశీయులు భారత్‌ను ఎగతాళి చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో రియాక్ట్ అయిన ఇండియా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.
Translate this News: