Onion Price Hike : ప్రస్తుతం ఉల్లి ధరలు అదుపులోనే ఉన్నాయి. అయినప్పటికీ భవిష్యత్ లో ఉల్లి విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకోకూడదని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉల్లి ద్రవ్యోల్బణాన్నిఅంటే ధరల పెరుగుదలను అడ్డుకోవడం కోసం ప్రభుత్వం పూల్ప్రూఫ్ ప్లాన్ను రూపొందించింది. ఆ తర్వాత ఉల్లికి సంబంధించి సంక్షోభం ఏర్పడినా సామాన్యులు పెద్దగా ఇబ్బందులు పడకుండా సహాయపడే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. గతేడాది ఉల్లి ధరలు(Onion Price) సామాన్య ప్రజలను కంటతడి పెట్టించాయి. అందుకే, అటువంటి పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. ఉల్లికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక రూపొందించిందో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Onion Price : ఉల్లి ధరలను అదుపులో ఉంచడానికి ప్రభుత్వం ఏం చేస్తోందంటే..
గతేడాది ఉల్లిధరలు ఒక్కసారిగా భగ్గుమని మంట పుట్టించి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాయి. అందుకే, ఈసారి అటువంటి పరిస్థితి రాకూడదని కేంద్రం ప్రత్యేకముగా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఏడాది 5 లక్షల టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి బఫర్ స్టాక్ పెట్టనుంది.
Translate this News: