Ramcahran and Janhvi: మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో టాప్ టెన్ లో ఉండే జగదేకవీరుడు.. అతిలోకసుందరి సినిమా ఉండి తీరుతుంది. చిరంజీవి-శ్రీదేవి జంట నిజంగా టైటిల్ కు తగ్గట్టుగానే మూవీలో కనిపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు చిరంజీవి తనయుడు ఈ సినిమా మెగా హీరో రామ్ చరణ్ ఇండియన్ సినిమా స్క్రీన్ పై ఒక రేంజ్ లో మెరిసిపోతున్నాడు. రంగస్థలం సినిమాతో స్టార్ యాక్టర్ గా గట్టి దమ్ము చూపించిన రామ్ చరణ్ తరువాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఇంకా చెప్పాలంటే గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఇటు దురదృష్టవశాత్తూ అందాల శ్రీదేవి మన మధ్యలో లేకపోయినా.. ఆమె వారసురాలిగా జాన్వీ కపూర్ ఇప్పుడు బాలీవుడ్ లో మంచి స్టార్ గా ఎదిగింది. టాలీవుడ్ లో ఆమె అడుగులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి. ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమాతో తెలుగులో జాన్వీకపూర్ (Ramcahran and Janhvi)ఎంట్రీ ఇస్తోంది.
పూర్తిగా చదవండి..Ramcahran and Janhvi: జగదేక వీరుడు.. అతిలోకసుందరి రామ్ చరణ్ – జాన్వీ అయితే ఎలా ఉంటుందంటే..
జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చరిత్ర రిపీట్ అయితే బావుండును అనిపిస్తుంది. దానిని రామ్ చరణ్-జాన్వీ కపూర్ చేస్తే బావుంటుంది అని చిరంజీవితో పాటు అభిమానులందరూ కోరుకుంటారు. ఆ ఇద్దరూ ఈ సినిమాలో ఉంటె ఎలా ఉంటుందో చెప్పే ట్రెండింగ్ లో ఉన్న వీడియో ఈ ఆర్టికల్ లో చూసేయండి.
Translate this News: