Ram Charan – NTR : ఆ ఇద్దరూ దాదాపుగా ఒకేసారి తెలుగు చిత్రసీమ(Telugu Cine Industry) లో అడుగుపెట్టారు. ఇద్దరికీ వారసత్వ నేపధ్యం ఉంది. ఒకరు తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసి.. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన నందమూరి తారకరామారావు పేరుతోనే సత్తా చాటిన నటుడు. మరొకరు దశాబ్దాలుగా తెలుగు సినిమా తెరపై మెగాస్టార్ గా వెలుగుతూ.. అప్పుడు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచిన.. నిలుస్తున్న చిరంజీవి వారసుడు రామ్ చరణ్. ఇద్దరిదీ నటనలో దమ్ము.. కష్టపడగలిగే తత్త్వం.. అన్నిటినీ మించిన స్నేహబంధం(Ram Charan vs NTR) కలిగిన బాటే. కానీ, ఇటీవల కాలంలో చూస్తే కనుక ఎన్ఠీఆర్ కంటే రామ్ చరణ్ ప్రతి అంశంలోనూ ముందు కనిపిస్తున్నాడు. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో కానీ, పాప్యులారిటీ పెంచుకోవడంలో కానీ అన్నిటినీ మించి తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో కానీ రామ్ చరణ్ దూసుకుపోతున్నాడు. కానీ, ఎన్టీఆర్ మాత్రం వెనుకపడిపోతున్నట్టు కనిపిస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది.
పూర్తిగా చదవండి..Ram Charan vs NTR : ఆ విషయంలో రామ్ చరణ్ కంటే.. ఎన్టీఆర్ వెనుకబడిపోతున్నాడా? కారణం అదేనా?
సమాన స్థాయి.. సమాన ప్రతిభ కలిగిన రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఈ ఇద్దరిలో పాప్యులారిటీ పెంచుకోవడంలో ఎన్టీఆర్ వెనుకపడిపోవడానికి కారణం ఏమిటి? టాలీవుడ్ విమర్శకులు చెబుతున్నదాని ప్రకారం ఎన్టీఆర్ పీఆర్ టీమ్ వెనుకబాటు కారణం అని తెలుస్తోంది
Translate this News: