Uday Kiran: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ హవా జోరుగా సాగుతోంది. అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న చిత్రాలు మరో సారి థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి. తమ అభిమాన హీరోల సినిమాలను మళ్ళీ కొత్తగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఒకప్పుడు హిట్ టాక్ రాని సినిమాలు కూడా రీ రిలీజ్ తర్వాత ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మహేష్ బాబు పోకిరితో మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మరో సూపట్ హిట్ మూవీ రీ రిలీజ్ కు సిద్ధమైంది. ఒకప్పుడు లవర్ బాయ్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఉదయ్ కిరణ్ సూపర్ హిట్ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కు రెడీ అవుతోంది.
పూర్తిగా చదవండి..Uday Kiran: ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్
హీరో ఉదయ కిరణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం 'నువ్వు నేను'. 2001 లో రిలీజైన ఈ చిత్రం.. 23 ఏళ్ల తర్వాత మళ్ళీ థియేటర్స్ లో సందడి చేయబోతుంది. తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. మార్చి 21న మరో సారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Translate this News: