Suspected in Rameshwaram Cafe Blast caught in CCTV : బెంగళూరు(Bangalore) లోని రామేశ్వరం కేఫ్(Rameshwaram Cafe) లో నిన్న(మార్చి 1) జరిగిన పేలుడు(Blast) పై దర్యాప్తు కొనసాగుతోంది. కర్ణాటక పోలీసులతో పాటు కేంద్ర ఏజెన్సీలు కూడా ఈ విషయంపై నిఘా పెట్టాయి. ముందుగా గ్యాస్ సిలిండర్(Gas Cylinder) పేలిందేమోనని అందరు అనుకున్నారు. కానీ ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆ కేఫ్‌లో బ్యాగ్ పెట్టాడని.. అందులో నుంచే పేలుడు సంభవించినట్లు కర్ణాటక సర్కార్ నిర్ధారించింది. ఇక తాజాగా ఈ కేసుపై కీలక అప్డేట్ వచ్చింది.
పూర్తిగా చదవండి..Rameshwaram Cafe Blast Updates: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు.. బాంబు పెట్టిన వ్యక్తి అరెస్ట్?
బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబును అమర్చిన వ్యక్తి ఆచూకీ లభ్యమైంది. హోటల్‌తోపాటు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి బాంబు పెట్టినట్లు స్పష్టంగా తేలింది. అతడి ముఖకవళికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతడిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది.
Translate this News: